Hitesh: వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో ఫైనల్ కు తొలి భారత బాక్సర్ 4 d ago

బ్రెజిల్ లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ హితేశ్ సంచలన ప్రదర్శన చేశాడు. 70 కేజీల కేటగిరీలో విజేతగా నిలవడానికి అడుగు దూరంలో ఉన్నాడు. శుక్రవారం హితేశ్ వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో ఫైనల్ కు దూసుకెళ్లాడు. సెమీస్ లో ఫ్రాన్స్ కు చెందిన బాక్సర్ మకాన్ త్రోరేపై వ్యూహాత్మకంగా దాడి చేసి.. 5-0 తేడాతో విజయం సాధించాడు. ఈ క్రమంలో వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్ కు చేరుకున్న తొలి భారత బాక్సర్ గా హితేశ్ నిలిచాడు.